ప్రముఖ ప్రవాసాంధ్రులు రమేష్ యలమంచిలి తన మంచి మనసు మరోసారి చాటుకున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు స్కూల్ బ్యాగ్ లు , స్టేషనరీ సామాన్లను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమం అమెరికా లోని ఎడిసన్ లో జరిగింది. సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ ఆవరణలో పిల్లలకు కావాల్సిన స్కూల్ బ్యాగ్ లతో పాటుగా స్టేషనరీని అందించారు. తమకు కావాల్సిన సదుపాయాలు అందించడంతో పిల్లల్లో సంతోషం వెల్లివిరిసింది. పిల్లలకు కావాల్సిన వస్తువులు సమకూర్చడంతో పలువురు ఎన్నారైలు రమేష్ యలమంచిలిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో రమేష్ యలమంచిలి తో పాటు సాయి దత్త పీఠం ఫౌండర్ శంకరమంచి రఘు శర్మ , ఎక్స్ అసెంబ్లీ మెన్ NJ , USA ఉపేంద్ర చవుకులతో పాటు పలువురు భక్తులు, ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అలాగే అట్లాంటిక్ సిటీకి చెందిన సుజాత వెంపరాల , పద్మ , అశోక్ స్వామి, మురళి మేడిచర్ల , దిశ , శ్రీధర్ గార్గ్ తదితరులు తమ ఓల్డ్ క్లాస్ బుక్స్ ని అమ్మేసి అలా వచ్చిన డబ్బుని ఈ సేవా కార్యక్రమాల్లో వినియోగించారు. ఈ సేవా కార్యక్రమాలు గత 9 సంవత్సరాలుగా చేస్తుండటం విశేషం.