హైదరాబాద్ కేంద్రంగా అరబిందో ఫార్మా పలు ఔషధాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అరబిందో ఫార్మా చేస్తున్న పలు ఔషధాలను భారత్ లో వినియోగించడమే కాకుండా అమెరికాకు కూడా ఎగుమతి చేస్తోంది. అలా ఎగుమతి చేసిన కొన్ని ఔషధాలను తాజాగా రీకాల్ చేసింది.
ఇంక్ – 9504 క్వినాప్రిల్ బాటిల్స్ , హైడ్రోక్లోరోథిజైడ్ ట్యాబ్లెట్లను రీకాల్ చేసినట్లుగా యుఎస్ ఎఫ్డీఏ తమ ఎన్ ఫోర్స్ మెంట్ రిపోర్ట్ లో వెల్లడించింది. ఈ ఔషధాలు అధిక రక్తపోటు నియంత్రణ కోసం వాడతారు. ఫాండాఫారిణుక్స్ సోడియం ఇంజక్షన్ 11,520 యూనిట్లను కూడా రీకాల్ చేసింది అరబిందో ఫార్మా.