
భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి బ్రిటన్ ప్రధానమంత్రి కానున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి బ్రిటన్ వర్గాలు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఓ భారతీయుడు ప్రధాని కావడం అన్నది భారత్ గర్వించతగ్గ విషయం. ఒకప్పుడు భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను బానిసలుగా చేసుకొని పరిపాలన సాగించింది బ్రిటిష్ ప్రభుత్వం.
కట్ చేస్తే కాలం గిర్రున తిరిగింది బ్రిటీష్ వ్యవస్థ కూడా పతనం అయ్యింది. బ్రిటన్ ప్రధాని రాజీనామా చేయడంతో ఆ పదవి చేపట్టే అవకాశం భారతీయుడికి దక్కనుందని తెలుస్తోంది. బ్రిటన్ లో ప్రస్తుతం ఆర్ధిక మంత్రిగా పనిచేస్తున్న రిషి సునాక్ కు ప్రమోషన్ లో భాగంగా ప్రధాని పదవి దక్కనుందని తెలుస్తోంది.
బ్రిటన్ ప్రధాని పదవికి దాదాపు 10 మంది పోటీ పడుతుండగా అందులో రిషి సునాక్ కూడా ఒకరు. రిషి సునాక్ పేరెంట్స్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. చాలా సంవత్సరాల క్రితమే భారత్ నుండి వెళ్లి యూకే లో స్థిరపడ్డారు. అంతేకాదు మరో విశేషం ఏంటంటే ….. రిషి సునాక్ భార్య ఇన్ఫోసిస్ నారాయణమూరి కూతురు. ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రిషి సునాక్.