ప్రపంచ పర్యావరణ సదస్సు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతుండగా వేదిక మీద కూర్చున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హడావుడిగా వేదిక నుండి వెళ్లిపోవడం సంచలనంగా మారింది. కాప్ – 27 సదస్సుకు మొదట హాజరు కాబోనని ప్రకటించి రిషి సునాక్ సంచలనం సృష్టించారు. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెంటనే యూటర్న్ తీసుకొని సదస్సుకు హాజరౌతానని ప్రకటించడమే కాకుండా సదస్సుకు వెళ్లి ప్రసంగించారు కూడా.
అయితే రిషి సునాక్ ప్రసంగం అయ్యాక కీలకమైన సమావేశం జరుగుతున్న సమయంలో రిషి సునాక్ సహాయకులు వరుసగా ఇద్దరు వచ్చి చెవిలో ఏదో చెప్పడంతో వేదిక మీద కూర్చున్న రిషి హడావుడిగా అక్కడి నుండి వెళ్లిపోయారు. సమావేశం జరుగుతున్నప్పటికీ రిషి హడావుడిగా వెళ్లిపోవడంతో మిగతా ప్రతినిధులు అంతా షాకయ్యారు. అయితే రిషి సునాక్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నది మాత్రం ఇంకా తెలియలేదు.