బ్రిటన్ ప్రధాని రేసులో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు రిషి సునాక్. భారత సంతతికి చెందిన ఇద్దరు బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతుండగా అందులో రిషి సునాక్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. మొత్తం ఎనిమిది మంది ఈ పదవికి పోటీ పడుతుండగా బుధవారం జరిగిన పోటీలో రిషి సునాక్ కు అత్యధికంగా 88 మంది ఎంపీలు మద్దతు పలికారు.
కాగా పెన్నీ మోర్డంట్ కు 67 ఓట్లు రావడంతో రిషి సునాక్ కు గట్టి పోటీ ఇస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే వాళ్ళు మాత్రమే బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎన్నిక అవుతారు. అయితే రిషి సునాక్ కు అత్యధిక ఎంపీలు మద్దతు పలుకుతున్నప్పటికీ కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున రిషి సునాక్ కు మద్దతు పలికితే మొట్ట మొదటి భారతీయ సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవుతాడు. అప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత సంతతి ఏలనుందన్న మాట.