భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో దూకుడుగా వ్యవహరించిన రిషి సునాక్ ఆ తర్వాత రేసులో వెనుకబడిపోయాడు. ఓటమి చెందాడు అందుకు రకరకాల కారణాలను ఎత్తి చూపుతోంది బ్రిటీష్ మీడియా అందులో మచ్చుకు కొన్ని చూద్దామా !
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడానికి ప్రధాన కారకుడు రిషి సునాక్. తనని నమ్మి ఆర్ధిక మంత్రిని చేసాడు జాన్సన్ . కానీ గురువుకు పంగనామాలు పెట్టి ప్రధాని పదవిని ఎలా దక్కించుకోవాలి అని పన్నాగాలు వేసిన వ్యక్తిగా కన్జర్వేటివ్ పార్టీ భావించిందట. జాన్సన్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం రిషి సునాక్ ఆరోపణలు చేయడమే కాకుండా ఆర్ధిక మంత్రిగా రాజీనామా చేసి జాన్సన్ పై ఒత్తిడి చేయడమే ప్రధాన కారణమని భావిస్తోంది బ్రిటీష్ మీడియా.
అలాగే రిషి సునాక్ ఓటమికి మరో కారణం అతడి భార్య అక్షత . ఆమె రాణి ఎలిజబెత్ కంటే సంపన్నురాలు అనే ముద్ర ఉంది బ్రిటన్ లో. అలాగే తన భర్త రిషి సునాక్ ఆర్ధిక మంత్రి కావడంతో ఆ హోదాని అడ్డుపెట్టుకొని పనులు ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
మరో కారణం ఏంటంటే …… రిషి సునాక్ దంపతులకు అమెరికా గ్రీన్ కార్డ్ హోదా ఉంది. బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా పని చేసిన రిషి ప్రధాని పదవికి పోటీ చేస్తున్న సమయంలో కూడా అమెరికా గ్రీన్ కార్డ్ హోదాను రద్దు చేసుకోలేదు దాంతో బ్రిటన్ లో గెస్ట్ గా మాత్రమే ఉండనున్నాడు ……. మళ్ళీ అమెరికా వెళ్లడం ఖాయం అని భావించడమే అని అంటున్నారు.
రిషి విలాసవంతమైన జీవితం కూడా అతడి పాలిట శాపం అయ్యింది. దాంతో కర్ణుడి చావుకు పలు కారణాలు అన్నట్లుగా రిషి సునాక్ ఓటమికి రకరకాల కారణాలు తోడయ్యాయి.