
విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం పలు ఆంక్షలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ కు పెద్ద ఎత్తున విదేశీ స్టూడెంట్స్ ఉన్నత చదువుల నిమిత్తం వస్తున్నారు. కాగా అలాంటి వాళ్లకు కొన్ని యూనివర్సిటీ లు స్టైఫండ్ కూడా ఇస్తున్నాయి. దాంతో ప్రతిభ కలిగిన వాళ్ళు పెద్ద మొత్తంలో బ్రిటన్ కు రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
అయితే అలాంటి వాళ్ళ వల్ల బ్రిటన్ పౌరులకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం తీవ్రత కూడా ఎక్కువ అవుతుండటంతో విదేశీ విద్యార్థులకు ఇచ్చే వీసాలను కఠినతరం చేయాలనే నిర్ణయానికి వచ్చారట. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ …… ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం తప్పకుండా ఫారిన్ స్టూడెంట్స్ కు ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పాలి.