
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ తాజాగా గోపూజ చేసాడు. తన భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్ లోని ఓ గోశాలకు వెళ్ళాడు. అక్కడ భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ గోపూజ నిర్వహించాడు. ఈ పూజలో రిషి సునాక్ తో పాటుగా ఆయన భార్య అలాగే పలువురు భారతీయులు కూడా పాల్గొన్నారు.
గోపూజ నిర్వహించడమే కాకుండా ఆ పూజ తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు రిషి సునాక్. ఎక్కడ ఉన్న మన మూలాలు మరవద్దన్న సంకేతాలు ఇచ్చాడు రిషి సునాక్. బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రధాని పదవి కోసం పలువురు పోటీ పడుతుండగా ప్రధాన పోటీ మాత్రం రిషి సునాక్ కు అలాగే లిజ్ ట్రస్ కు మాత్రమే. అయితే కన్జర్వేటివ్ ల మద్దతు ఎక్కువగా లిజ్ ట్రస్ కు ఉండటంతో రిషి సునాక్ రేసులో వెనుకబడిపోయాడు. అయినప్పటికీ పట్టువదలడం లేదు. ఇక బ్రిటన్ ప్రధాని ఎవరు అనేది సెప్టెంబర్ 5 న తేలనుంది.