
బ్రిటన్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టలేడు……. ఎందుకంటే ఇప్పటికే బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరు అనేది తేలిపోయింది. బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బ్రిటన్ ప్రధాని పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5 న బ్రిటన్ కు కాబోయే ప్రధాని ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే బ్రిటన్ ప్రధాని పదవి కోసం పలువురు పోటీ పడినప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మద్యే నెలకొంది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు అలాగే బ్రిటన్ మహిళ లిజ్ ట్రస్ మధ్య మాత్రమే పోటీ నెలకొంది. మొదట్లో రిషి సునాక్ జోరు ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాత రేసులో అనూహ్యంగా లిజ్ ట్రస్ ముందంజలో నిలిచింది. దాదాపుగా లిజ్ ట్రస్ గెలుపు ఖాయమైపోయింది. కాకపోతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే తప్పకుండా భారత సంతతికి చెందిన రిషి సునాక్ విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. మరి ఆ అద్భుతం జరుగుతుందా ? కన్జర్వేటర్స్ రిషి సునాక్ కు అండగా నిలబడతారా ? చూడాలి.