
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉండటంతో ఒక భారతీయుడు బ్రిటన్ కు ప్రధాని కాకూడదు అనే కుట్ర చేస్తున్నారు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. తాజాగా తన మద్దతుదారులతో సమావేశమైన బోరిస్ జాన్సన్ కీలక ఆదేశాలు ఇచ్చారట.
రిషి సునాక్ తప్ప మిగతా అభ్యర్థులలో ఎవరైనా సరే ప్రధానిగా ఎన్నుకోండి అంతేకాని రిషి సునాక్ ని మాత్రం గెలవకుండా చూడండి అని గట్టిగా చెప్పాడట. రిషి సునాక్ బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఆర్ధిక శాఖా మంత్రిగా పని చేసాడు. అప్పుడు రిషి సునాక్ అంటే బోరిస్ కు ఇష్టమే ! కానీ ఇప్పుడు మాత్రం రిషి పై విషం చిమ్ముతున్నాడు. ఇదంతా ఎందుకంటే ……. ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని కాకూడదు అనే కారణంతో. అయితే బ్రిటన్ ప్రధాని రేసులో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నాడు రిషి. దాంతో అతడ్ని నిలువరించాలంటే ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందే అని భావించిన బోరిస్ జాన్సన్ కుట్ర కు తెరలేపాడు.