
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం మొదలైంది. ఉక్రెయిన్ ని నిలువరించడానికి అణుబాంబు దాడి చేయడమే మిగిలిందని , 3 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామని పుతిన్ ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా రష్యా ప్రజలలో వణుకు మొదలైంది. ఇది తప్పకుండా మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందని భావిస్తున్నారు.
యుద్ధం అంటే సాధారణ యువకులు కూడా యుద్ధరంగానికి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో ఆ వయసు వాళ్ళు రష్యాను విడిచి వేరే దేశాలకు వెళ్తున్నారు. దాంతో ఒక్కసారిగా రష్యాలో ఎయిర్ ట్రాఫిక్ ఏర్పడింది. గత ఎనిమిది నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా దళాలు మొదట ఉక్రెయిన్ ని అతలాకుతలం చేసినప్పటికీ అమెరికా అండతో ఉక్రెయిన్ పుంజుకుంది. దాంతో రష్యా దళాలు తోకముడిచాయి. ఎనిమిది నెలలు అవుతున్నా యుద్ధం పూర్తి కాకపోవడంతో రష్యా ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. దాంతో ఆ అపప్రధ నుండి బయట పడటానికి అణుబాంబు వేస్తానని అంటున్నాడు పుతిన్.