ఉక్రెయిన్ పై దండయాత్ర చేసిన రష్యా కీలకమైన నాలుగు ప్రాంతాలను తన వశం చేసుకుంది. ఉక్రెయిన్ లో దాదాపు 15 శాతం భూభాగమైన కీలక నాలుగు ప్రాంతాలైన ‘ జపోరిఝియా’ , ‘ ఖేర్సన్ ‘, ‘ లుహాన్స్క్ ‘, ‘ డొనేట్ స్క్ ‘ లను రష్యాలో విలీనం చేసుకుంది. ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా రిఫరెండం నిర్వహించగా మెజారిటీ ప్రజలు రష్యాలో విలీనం కావడానికి మొగ్గు చూపాయని గురువారం ప్రకటించింది రష్యా. అలాగే ఈరోజు అధికారికంగా రష్యాలో విలీనం కానున్నాయి. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకానున్నారు.
ఇక ఇదే సమయంలో అమెరికా , ఉక్రెయిన్ రష్యా చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. అంతేకాదు ఉక్రెయిన్ నుండి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను మళ్ళీ సొంతం చేసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రతిజ్ఞ పూనాడు. రష్యాలో ఉంటున్న అమెరికా పౌరులను తక్షణమే ఆ దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది అమెరికా.