అమెరికాలోని న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం , శ్రీ శివ విష్ణు టెంపుల్ లో జూన్ 2 నుండి 4 వ తేదీ వరకు మూడు రోజుల పాటు దుర్గమ్మ కు కుంకుమార్చన చేయనున్నారు. ఇప్పటికే అమెరికాలోని పలు ప్రాంతాల్లో దుర్గమ్మకు కుంకుమార్చన లతో పాటుగా ఆర్జిత సేవలు నిర్వహించగా జూన్ 2 నుండి 4 వరకు సాయి దత్త పీఠంలో కుంకుమార్చన నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసారు. న్యూజెర్సీ ఎడిసన్ ఉన్న ప్రవాసాంధులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.