తెలుగువాళ్ళకు అతిపెద్ద పండగ సంక్రాంతి కావడంతో ఆ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా ఈ పండుగను పెద్ద అట్టహాసంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగకు ఇంకా కొద్దిరోజుల సమయం ఉన్నప్పటికీ వారం , పది రోజుల ముందే ఆ హడావుడి మొదలు అవుతుంది. పెద్ద ఎత్తున రకరకాల పిండివంటకాలు చేస్తుంటారు. సామూహిక పిండి వంటకాలు గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంటలో జరిగాయి.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు , పురుషులు పాల్గొని అరిసెలతో పాటుగా మిగతా వంటకాలు వండారు. ఇక తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన స్వయంగా అరిసెలు వంకటంలో పాల్గొనడం విశేషం. సతీష్ వేమనతో పాటుగా జెడ్పిటిసి మాజీ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మీ , ఉప్పుటూరి రామ్ చౌదరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా భాను మాగులూరి తదితరులు పాల్గొన్నారు.