
మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి సత్య నాదెళ్ల హాజరు కాలేదు.
దాంతో అమెరికాలోని భారత్ కాన్సులేట్ జనరల్ నాగేంద్ర ప్రసాద్ శాన్ ఫ్రాన్సిస్కో లో పద్మభూషణ్ అవార్డ్ కు సత్య నాదెళ్ల కు అందించారు. దాంతో ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని, 2023 లో భారత్ లో పర్యటిస్తున్నానని స్పష్టం చేశారు సత్య నాదెళ్ల.