సౌదీ అరేబియా తెలుగు కుటుంబాలకు షాక్ ఇచ్చింది. వీసాల పునరుద్ధరణ పలు ఆంక్షలు విధించడంతో సౌదీ లో ఉంటున్న తెలుగువాళ్లు తీవ్ర ఇబ్బందుల పాలౌతున్నారు. గడువు పెంచే ఆలోచనలో సౌదీ ప్రభుత్వం లేదు కాబట్టి సందర్శక వీసాల మీద సౌదీ కి వెళ్లిన వాళ్ళు తట్టా బుట్టా సర్దుకొని ఇండియాకు తిరిగి వచ్చే పనిలో పడ్డారు.
సందర్శక వీసాలను ప్రతీ మూడు నెలలకు ఒకసారి గడువు పెంచుకునే వెసులుబాటు ఇంతకుముందు కల్పించారు. దాంతో ఏడాది పాటు ఉండొచ్చు అని సంతోషపడిన వాళ్లకు షాక్ ఇచ్చింది సౌదీ. సందర్శక వీసాల గడువును ఇప్పటిలో పెంచేది లేదని తేల్చి చెప్పడంతో సందర్శక వీసాల మీద వెళ్లిన వాళ్ళు ఇండియాకు తిరిగి వచ్చే పనిలో పడ్డారు.