28 C
India
Saturday, September 14, 2024
More

    భారత రక్షణమంత్రిత్వశాఖ శాస్త్ర సాంకేతిక సలహాదారు జి . సతీష్ రెడ్డితో తో డల్లాస్ వాసుల ఆత్మీయ సమ్మేళనం !

    Date:

    Science and Technology Adviser to Ministry of Defense G. A soulful gathering of Dallas residents with Satish Reddy
    Science and Technology Adviser to Ministry of Defense G. A soulful gathering of Dallas residents with Satish Reddy

    మాజీ DRDO ఛైర్మన్ ,సైంటిస్ట్ ,ప్రభుత్వ రక్షణ సలహాదారుడు జి సతీష్ రెడ్డి కి ఆయన తో కలిసి చదువుకున్న JNTU మిత్రులు మరియు ఇతర ప్రముఖులు కలిసి డల్లాస్ లో ఏర్పాటు చేసిన “మీట్ అండ్ గ్రీట్ ” లో పెద్ద ఎత్తున ప్రవాసులు పాల్గొని వారికీ అపూర్వ ఆతిధ్యం మరియు ఆత్మీయ సత్కారం నిర్వహించారు .

    ఈ సందర్భంగా మొదట ఆయన డల్లాస్ మిత్రులు రంగారావు ,శ్రీనివాస రాజు ,బి. శ్రీనివాసమూర్తి గార్లు మరియు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన డీ. శ్రీనివాస మూర్తి . ,శీనప్ప ,శ్రీనివాసులు ,రామారావు,రమణారావు , భక్త , రమణ ప్రసాద్లు లు మాట్లాడుతూ సతీష్ రెడ్డి తో తమ విద్యాభ్యాసం మరియు వారితో వున్న పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు .
    శాస్త్ర విజ్ఞానం పట్ల వారి మక్కువ ,అభిరుచి , అంకిత భావం ,పట్టుదల ,కృషి తో పాటు వారి అమూల్యమైన DRDO పరిశోధనల తో పాటు , భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి తో కలిసి ప్రయాణం చేయడం ,
    తమ మిత్రుడు యువ సైంటిస్ట్ నుంచి సైంటిఫిక్ అడ్వైసర్ (డిఫెన్స్) గా ,సెక్రటరీ DR&D మరియు DRDO చైర్మన్ గా అనేక శాస్ర పరిశోధనలకు తుది రూపం ఇవ్వడం తో పాటు ,సరి కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టి , గట్టి ప్రణాళిక తో వాటిని పరిమిత కాలం లో సాధించడం విశేషం అన్నారు .తమ మిత్రుడు భారత దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల లో ఒకరు గా ఉండటం తమకు గర్వకారణం అన్నారు .

    ఇతర వక్తలు మాట్లాడుతూ సతీష్ రెడ్డి గారు DRDO ఛైర్మన్ గా వున్నప్పుడు , కోవిడ్ మహమ్మారి భారత్ పై విరుచుకు పడిన పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో DRDO కోవిడ్ పేషెంట్ల కోసం వెంటిలెటర్ లను యుద్ధ ప్రాతిపదికన స్వయంగా ఉత్పత్తి చేయడం తో పాటు , అన్ని సదుపాయాలు కల తాత్కాలిక బెడ్లు శీఘ్రగతిన ఏర్పాటు చేయడం లాంటివి సతీష్ రెడ్డి నాయకత్వ లక్షణాల కు మచ్చు తునకలు అని అన్నారు . శాస్త్ర రంగంలో ,పరిశోధనల్లో వరుసగా ప్రఖ్యాత అవార్డులు లైన హోమీ బాబా మెమోరియల్ గోల్డ్ మెడల్ తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులైన Missile Systems Award ,National Design Award,National Aeronautical Prize మరియు National Systems Gold Medal లను పొందారని చెప్పారు .

    చివరగా ముఖ్య అతిథి సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ DRDO తో తన పయనం , అబ్దుల్ కలాం గారితో శిష్యరికం, వారి నుంచి నేర్చుకున్న పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం , దాన్ని త్వరిత గతిన సాధించడం కోసం శ్రమించడం . అహర్నిశలు దేశ అవసరాల కోసం కార్యోన్ముఖులై శాస్త్ర బృందం తో పనిచేయడం లాంటి వారి నుంచి ప్రేరణ పొందానని చెప్పారు .భారతదేశం గత ఎనిమిదేళ్ళలో కొత్త పుంతలు తొక్కిందని, శ్తాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రత్యేకించి దేశరక్షణ పరిశోధనా రంగానికి దేశం పెద్ద పెద్ద లక్ష్యాలు నిర్దేశించి లక్ష్యసాధనకు కావలసిన వనరులు సమకూర్చడం వల్ల ముందెన్నడూ లేని విధంగా మన దేశ రక్షణకు అవసరమైన అన్ని రకాల ఆయుధాలు, క్షిపణుల పరిశోధన మరియు తయారీ దేశీయంగానే చేసే మహాక్రతువు లో సఫలమైందని, సైనిక తుపాకులు, బాంబులు, అగ్ని-ప్రళయ్-బ్రహ్మోస్ వంటి క్షిపణులు, తేజస్ వంటి యుద్ధ విమానాలు, ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ వంటి యుద్ధనౌకలు, ఒకటేమిటి, చిన్న మందుగుండు సామాగ్రినుంచి భూతల, గగనతల, సముద్ర, అంతరిక్ష సంబంధ ఆయుధ సంపత్తి వరకు నేడు భారత్ దేశీయంగానే తయారుచేస్తూ స్వయంసంవృద్ధి దిశగా దూసుకుపోతుందని, భారత్ తమ స్వీయ అవసరాలకు మాత్రమే కాకుండా రానున్న కాలంలో విదేశాలకు అవసరమైన ఆయుధసంపత్తిని ఎగుమతి చేసే విధంగా తయారు కానుందని, దీనివల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం గౌరవం ఇనుమడించడమే కాకుండా శక్తివంతమైన భారతావనికి విదేశాల మైత్రీసంబందాలు మెరుగవుతాయనీ అన్నారు. ఇంతేకాకుండా నేటి యువతలో పెద్ద మార్పు చూస్తున్నామని, ఐ.ఐ.టి మరియు ఉన్నత విశ్వవిధ్యాలయాల్లో నుండి బయటకువస్తున్న విద్యార్థులలో గత ఐదేళ్ళనుండి విదేశాలకు వెళ్ళే సంఖ్య బాగా తగ్గిందని,దీనికి భారత్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ శాస్త్ర సంకేతిక పరిశోధనా పురోగతి మరియు మౌలికవనరులని, దానివల్ల భారత్ లోనే ఉండి పనిచేయడానికి ఇష్టపడుతున్నారని, దేశ మార్పు కోసం జరుగుతున్న ఈ మహా యజ్ఞం లో ప్రజల స్పందన అద్భుతంగా ఉందని, ప్రవాసులు గా మీ వంతు కృషి తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.వారి ప్రతి మాటకు సభికులు కరతాళ ధ్వనులతో పెద్ద ఎత్తున స్పందించారు .

    అమెరికాలోని వివిధ తెలుగు అసోసియేషన్స్ అయిన టాంటెక్స్,తానా ,నాటా ,నాట్స్ ఆటా సంస్థల ప్రతినిధులు శ్రీ సతీష్ రెడ్డి గారిని మొమెంటో బహూకరించి శాలువాలతో ,గజమాలతో ఘనంగా సత్కరించారు .
    నాటా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి మాట్లాడుతూ మన తెలుగు తేజం సతీష్ రెడ్డి దేశానికి చేసిన సేవలు కొనియాడారు, డల్లాస్ లో జరిగే నాటా సభలకు ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేయ వలసినదిగా ఆహ్వానం అందించారు.

    అదేవిధముగా , వీడియో కాన్ఫరెన్స్ ద్యారా ఇతర ప్రదేశాల నుండి విలాస్ జంబుల , శ్రీకాంత్ తుమ్మల , సంతోష్ రెడ్డి కోరం , ప్రదీప్ కట్ట బృందం వీక్షించి వారి స్ఫూర్తి దాయక ప్రసంగము పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు

    సభలో NRI ప్రముఖులు చిల్లకూరు గోపి రెడ్డి ,అజేయ్ కలువ , ఉప్పలపాటి కృష్ణా రెడ్డి ,రామకృష్ణ ,ప్రదీప్ రెడ్డి ,బలరాం ,భీమా పెంటా ,భాస్కర్ రెడ్డి ,సురేష్ మండువ లు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Balineni : బాలినేనికి నచ్చ చెప్తున్న వైసీపీ అధినాయకత్వం.. వరుసగా కలుస్తున్న అధినాయకులు.. మనసు మార్చుకుంటారా?

    Balineni : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

    Beer : దేశంలో ఏ బీర్లను ఎక్కువమంది తాగుతున్నారో తెలుసా..

    Beer : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మద్యం తాగుతుంటారు. అనేక...

    Mattu Vadalara 2 : యూఎస్ బాక్సాఫీస్.. ‘మత్తు వదలారా 2’కు మంచి ఆరంభం

    Mattu Vadalara 2 : సాధారణంగా సీక్వెల్ అంటే ఆశించినంత విజయం...

    Kamma-Reddy : కమ్మా-రెడ్డి వైరం తెలంగాణకు చేటు చేస్తుందా?

    Kamma-Reddy Politics : గత రెండు రోజలుగా కొనసాగుతున్న అరెకపూడి గాంధీ,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ప్రభుత్వ రక్షణ సలహాదారు సతీష్ రెడ్డిని సన్మానించిన డల్లాస్ మిత్రులు

    DRDO మాజీ ఛైర్మన్ , ప్రభుత్వ రక్షణ సలహాదారుడు జి. సతీష్...