సౌదీలో తెలుగు నర్సులు విశిష్ట సేవలు అందిస్తున్నారు. దాంతో తెలుగు నర్సులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసుపత్రి పాలైన రోగులకు సేవలు అందించేది డాక్టర్లు మాత్రమే కాదు నర్సులు కూడా. అయితే చికిత్స అందిస్తున్న డాక్టర్ లకు ఎక్కువగా ప్రశంసలు దక్కుతాయి. కానీ డాక్టర్ల కంటే ఎక్కువగా సేవ చేసే నర్సులకు మాత్రం ఆ స్థాయిలో గుర్తింపు లేదు మన భారతదేశంలో.
అయితే విదేశాల్లో మాత్రం డాక్టర్లతో పాటుగా నర్సులకు కూడా గౌరవం లభిస్తుంది. డాక్టర్ ల సేవలు అమోఘం అయితే వాళ్ళ కంటే ఎక్కువగా రోగికి సేవలు అందించేది నర్సులు కావడం విశేషం. ముఖ్యంగా సౌదీ లాంటి దేశాల్లో నర్సుల సేవలకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక కరోనా కష్టకాలంలో వీళ్ళ సేవలకు మరింత ముగ్దులు అవుతున్నారు. విదేశాలలో కూడా మన భారతీయులు నర్సులుగా పనిచేస్తున్నారు. ఇందులో కేరళ వాళ్ళు ప్రధమ స్థానంలో ఉంటె ఆ తర్వాత స్థానంలో మన తెలుగువాళ్లు ఉన్నారు.