బాలీవుడ్ బాద్ షా , కింగ్ ఖాన్ షారుఖ్ అమెరికాలో క్రికెట్ స్టేడియం కట్టించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. భవిష్యత్ లో అమెరికాలో కూడా పెద్ద ఎత్తున క్రికెట్ కు దాసోహం అవడం ఖాయమని భావించే అధునాతనమైన క్రికెట్ స్టేడియంని అమెరికాలోని కాలిఫోర్నియా లో కట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
షారుఖ్ ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ కు యజమాని అనే విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ఒక జట్టుకు యజమానిగా ఉన్న షారుఖ్ తాజాగా మేజర్ క్రికెట్ లీగ్ T 20 తో కలిసి ఈ స్టేడియం నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆమేరకు ఒప్పందాలు జరిగాయి. 2024 లో అమెరికాలో టి 20 క్రికెట్ పోటీలు జరుగనున్నాయి. అమెరికాతో పాటుగా వెస్టిండీస్ లలో ఈ పోటీలు జరుగనున్నాయి. దాంతో ఆలోగా ఈ స్టేడియం నిర్మాణం పూర్తి చేయనున్నారు.