
జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే( 67) మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. నరా నగరంలో జరిగిన ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో వెనుక నుండి ఓ దుండగుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు . దాంతో గాయాలపాలైన షింజోని వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. అయితే మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు షింజో అబే.
జపాన్ లో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు షింజో. అయితే ప్రచారంలో పాల్గొన్న షింజో ని చంపారంటే తప్పకుండా ఇది రాజకీయ హత్యే అని అంటున్నారు. జపాన్ కు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన వాళ్లలో షింజో అగ్రగణ్యుడని కొనియాడుతున్నారు జపాన్ ప్రజలు.