అమెరికాలో కాల్పుల మోత మోగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో నిత్యం ఎక్కడో ఒకచోట కాల్పులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా చికాగోలో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ కాల్పుల్లో 8 మంది మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. దాంతో గాయపడిన వాళ్ళని స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అమెరికా పోలీసులు.
సౌత్ కిల్ ప్యాట్రిక్ , బ్రైటన్ పార్క్ , సౌత్ ఇండియానా , నార్త్ కెడ్జి అవెన్యూ , హోమ్ బోల్ట్ పార్క్ లలో దుండగులు రెచ్చిపోయి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 8 మంది అక్కడికక్కడే చనిపోగా 16 మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ కాల్పులు జరిగాయి. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.