అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యూయార్క్ లోని ఓ సూపర్ మార్కెట్ లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. సూపర్ మార్కెట్ లోకి వచ్చిన దుండగుడు నేరుగా కాల్పులు జరిపాడు. 10 మందికి మృతికి కారణమైన దుండగుడిని ఎఫ్ బిఐ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్య పట్ల అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వెలిబుచ్చారు.






