
అమెరికా దిగ్గజ బ్యాంక్ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ను కేవలం 99 రూపాయలకే HSBC బ్యాంక్ సొంతం చేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టే బ్యాంక్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్. అలాంటి బ్యాంక్ ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. దాంతో ఆ బ్యాంక్ ను మూసెయ్యాల్సి వచ్చింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత నిర్ణయం సంచలనం సృష్టించింది ప్రపంచ వ్యాప్తంగా.
ఇక ఈ అమెరికన్ బేస్డ్ బ్యాంక్ ను యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ప్రఖ్యాత బ్యాంకింగ్ దిగ్గజం HSBC సొంతం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక ఈ బ్యాంక్ కొనుగోలు కోసం HSBC వెచ్చిస్తున్న సొమ్ము ఎంతో తెలుసా ……. కేవలం 99 రూపాయలు మాత్రమే ! అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజమే ! నట. ఎందుకంటే …… సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీయడమే ఇందుకు కారణం.