అగ్రరాజ్యం అమెరికా మంచు తుఫాన్ తో అల్లాడిపోతోంది. అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా మంచు తుఫాన్ వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. ఇక కెనడాలో కూడా మంచు తీవ్రత ఎక్కువగానే ఉంది. అక్కడి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రకరకాల అవసరాల నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తోంది. అయితే ఆ సమయాల్లో చాలా అవస్థలు పడుతున్నారు. రోడ్డు మీద కాలు తీసి కాలు పెట్టి నడవలేకపోతున్నారు…… మంచు ధాటికి కాళ్ళు జారుతున్నాయి ….. కింద పడుతున్నారు ……. లేచి నిలబడటానికి ముందుకు అడుగు వేయడానికి ఇబ్బంది పడుతున్నారు.
ప్రజలతో పాటుగా అధికారులు కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. మంచు తీవ్రత వల్ల రోడ్లన్నీ మంచుతో కప్పబడిఉన్నాయి. ఇక రోడ్ల మీద ప్రయాణిస్తున్న కార్లు అదుపుతప్పి ప్రమాదానికి గురౌతున్నాయి. రోడ్ల మీద కారు ముందుకు వెళ్లలేకపోతోంది. దాంతో అదుపుతప్పి ఒకదానికి ఒకటి ఢీకొంటున్నాయి. ఆ సమయంలో పలు కార్లు బాగా దెబ్బతింటున్నాయి.
మంచుతో ప్రజలు మాత్రమే కాదు జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా ఓ జింక మంచుతో చాలా అవస్థలు పడింది. పాపం ….. నీళ్లు తాగుదామని అనుకుంటే ముఖం మొత్తం మంచుతో కప్పుకుపోయింది. అలాగే వెనకాల కూడా మంచు గడ్డకట్టింది. జింక ఒళ్ళంతా కూడా మంచు గడ్డలు కట్టుకుపోయాయి. దాంతో చాలా అవస్థలు పడింది పాపం. అయితే ఓ మానవతావాది సదరు జింక అవస్థలు చూసి చలించిపోయాడు. ఆ జింక కు పట్టిన మంచుపెంకులను ఒక్కొక్కటిగా తీసి దానికి బంధవిముక్తి కల్పించాడు. మంచు తుఫాన్ తీవ్రత ఎంత దారుణంగా ఉందో ఈ వీడియోలను చూస్తే అర్ధమౌతుంది.