అగ్రరాజ్యం అమెరికా మంచు తుఫాన్ తో అల్లాడుతోంది. ముఖ్యంగా న్యూయార్క్ మహానగరం మంచు తుఫాన్ తో అతలాకుతలం అవుతోంది. న్యూయార్క్ లోని ప్రధాన రహదారులన్నీ మంచుతో మూసుకుపోయాయి. రోడ్ల మీద ఆరు అడుగుల మేర మంచు కప్పబడి ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక మంచు తుఫాన్ కారణంగా న్యూయార్క్ లో ఇద్దరు మరణించగా 280 మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
రోడ్ల మీద పేరుకుపోయిన మంచును తొలగించడానికి కష్టపడుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ మంచు ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇళ్ల లోనుండి బయటకు రావద్దని , ఒకవేళ అత్యవసరం నిమిత్తం రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.