
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు ఘన నివాళులు అర్పించారు ప్రవాసాంధ్రులు. భారతీయ చలనచిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన మహానుభావుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. మధురమైన పాటలతో ప్రేక్షకుల హృదయాలలో అజరామరుడిగా నిలిచిన బాలు….. కరోనా మహమ్మారితో 2020 లో స్వర్గస్తులయ్యారు. దాంతో బాలు మరణాన్ని తట్టుకోలేక కోట్లాది అభిమానులు శోకసంద్రంలో మునిగారు.
సెప్టెంబర్ 25 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి రోజు. దాంతో ఆ రోజున గాన గాంధర్వుడికి ఘన నివాళి అర్పించాలని భావించిన ప్రవాసాంధ్రులు భారీ ఎత్తున ” బాలు వర్ధంతి సభ ” ను ఏర్పాటు చేశారు. న్యూయార్క్ మహానగరంలోని ఎడిసన్ లో SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ మరియు సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ మహత్కార్యానికి తన వంతు బాధ్యతగా వ్యవహరించారు JSW & Jaiswaraajya అడ్వైజర్ , UBlood ఫౌండర్ జగదీష్ యలమంచిలి. బాలు ఆలపించిన పలు సూపర్ హిట్ పాటలను పాడి గాన సుమాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. బాలుతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.