Anandmurti Gurumaa: ఆధ్యాత్మిక, యోగా గురువు, మాతృమూర్తి ఆనంద్ మూర్తి గురుమా. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆనంద్ మూర్తి ఇప్పుడు న్యూ జెర్సీలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం ఉరుకులు, పరుగులుగా ఉన్న జీవితంలో ఆరోగ్యం కూడా ప్రధానమైనదేనని దాన్ని కూడా భద్రంగా చూసుకోవాలని చెప్తున్నారు. అందుకు యోగా, ప్రాణాయామం లాంటివి చాలా ఉపయోగపడతాయని సూచిస్తున్నారు.
దైనందిన జీవితంలో భాగంగా ఉద్యోగులు ఉరుకులు, పరుగులతో తీవ్రమైన ఒత్తిడి (Stress)ని ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక శారీరక, మానసిక రుగ్మతలు సంభవిస్తున్నాయి. వీటి కారణంగా మనిషి ఆయువు తొందరగా తీరిపోతోంది. వీటిని తగ్గించాలంటే యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్ సైజులతో మాత్రమే వీలవుతుంది. అందుకే ఆమె ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మోగాతో కలిగే మేలు, బ్రీతింగ్ వల్ల శరీరంలో జరిగే మార్పుల గురించి ఆమె మరింత లోతుగా వివరించనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ శనివారం, 10వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యోగా, ప్రాణాయామాలపై అవగాహన కల్పిస్తారు. రారిటన్ వ్యాలీ కమ్యూనిటీ కాలేజ్, RVCCARTS నాశ్ థియేటర్, 118 లామింగ్టన్ రోడ్, బ్రాంచిబర్గ్, న్యూ జెర్సీ-08876లో ఆమె ప్రసంగం ఉంటుంది. ఎటువంటి రుసుం లేకుండా కార్యక్రమంలో పాల్గొనవచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు.