శ్రీలంకలో మళ్ళీ ఆందోళనకారులు రోడ్డెక్కారు. దాంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశాన్ని విడిచి పారిపోయాడంటూ రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. శ్రీలంక నేవీ నౌకలో పెద్ద పెద్ద సూట్ కేసులతో దేశాన్ని విడిచి పారిపోయాడంటూ శ్రీలంక మీడియాలో కథనాలు వెలువడగా మరికొన్ని మీడియాలలో మాత్రం ప్రత్యేక విమానంలో భారీ నగదుతో పారిపోయాడంటూ కథనాలు వెలువడ్డాయి.
అయితే రెండింటి సారాంశం ఒక్కటే ! అది శ్రీలంక అధ్యక్షుడు పారిపోయాడు అనే విషయం. కాకపోతే నౌకలో వెళ్లాడా ? స్పెషల్ ఫ్లయిట్ లో వెళ్లాడా ? అనేది. శ్రీలంకలో గతకొంత కాలంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ధరలు భారీగా పెరగడమే కాకుండా పెట్రోల్ , గ్యాస్ అందుబాటులో లేకుండాపోయాయి. అలాగే ఏది కావాలన్నా కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడేమో ఏకంగా శ్రీలంక అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా తయారవ్వడంతో ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేసారు.