ఆస్టిన్ లోని షిరిడి సాయిబాబా ఆలయంలో అలాగే శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తెలుగువాళ్ళు తరలివచ్చారు. ఏకంగా 6000 మంది శ్రీరామనవమి వేడుకలలో పాల్గొనడం విశేషం. తెలుగువాళ్లు అమితంగా ఇష్టపడే దేవుడు శ్రీరాముడు. అందుకే శ్రీరామ నవమి వేడుకలను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలలో తెలుగువాళ్లు అందరూ పాల్గొని విజయవంతం చేసారు. సాయిబాబా కు చందన , చావడి ఉత్సవాలను కూడా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం తర్వాత తీర్థ ప్రసాదాలను భక్తులకు పంచారు.
Breaking News