తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా శ్రీనివాసుడి కల్యాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా నిత్యకళ్యాణం – పచ్చతోరణం అన్నట్లుగా ఎక్కడో ఒక చోట శ్రీనివాస కల్యాణం జరుగుతూనే ఉంటుంది. తాజాగా యూకే , యూరప్ దేశాలలో శ్రీనివాస కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈనెల 3 న జర్మనీ లోని మునిక్ లో , 5 వ తేదీన ఫ్రాంక్పర్ట్ , 6 న ఫ్రాన్స్ లోని పారిస్ లో ఈ ఉత్సవాలు టీటీడీ వేద పండితులసమక్షంలో జరిగినట్లు ఏపీఎన్ ఆర్టిఎస్ అధ్యక్షుడు వెంకట్ మెడపాటి తెలిపారు.
Breaking News