
అగ్రరాజ్యం అమెరికాలోని ఎడిసన్ లో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, గాన విద్యా ప్రవీణ బిరుదాంకితులు శ్రీ గరికపాటి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో స్వర రాగావధానం ప్రత్యేక సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎడిసన్ మేయర్ సామ్ జోషి హాజరయ్యారు.
JSW & JaiSwaraajya అడ్వైజర్, Ublood ఫౌండర్ జగదీష్ యలమంచిలితో పాటుగా పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొని ఈ సంగీత కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సెప్టెంబర్17 న జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘము అలాగే తెలుగు కళా సమితి నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి JSW మరియు Jaiswaraajya యూట్యూబ్ చానల్స్ అలాగే వెబ్ సైట్స్ మీడియా పార్ట్ నర్ గా వ్యవహరించాయి.