ఉత్తర అమెరికా తెలుగు సంఘము ( TANA ) ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 8 న అమెరికాలో ఈ సంబరాలు జరుగనున్నాయి. ఇక ఈ వేడుకకు హాట్ భామ అనసూయ , సింగర్ మంగ్లీ , మిమిక్రీ రమేష్ లు హాజరుకానున్నారు. రమేష్ మిమిక్రీ తో , మంగ్లీ పాటలతో అలరించనున్నారు. ఇక హాట్ భామ అనసూయ యాంకర్ గా , అతిథిగా కూడా వ్యవహరించనుంది. ఈ కార్యక్రమం ఆద్యంతం JSW & Jaiswaraajya యూట్యూబ్ ఛానల్ లలో లైవ్ ప్రసారం కానుంది.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటను ఆడనున్నారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.