2023 జులై 7 నుండి 9 వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే తానా మహాసభలకు కన్వీనర్ గా పొట్లూరి రవిని నియమించినట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. 23 వ తానా మహాసభలు అమెరికాలోని ఫిలడెల్పియాలోగల పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్నాయని పేర్కొన్నారు లావు అంజయ్య చౌదరి.
2023 లో జరిగే తానా మహాసభల వేదిక కోసం అట్లాంటా తో పాటుగా పలు ప్రాంతాలను చూశామని చివరకు పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ బెటర్ అని ఫీలయ్యామని అందుకే దాన్నే ఆమోదించాలని తానా కమిటీని కోరగా అందుకు కమిటీ ఆమోదం తెలిపిందని , ఇక వేడుకల నిర్వహణా బాధ్యత పొట్లూరి రవికి అప్పగిస్తే బాగుంటుందని మెజారిటీ సభ్యులు భావించారని అందుకే అతడ్ని కన్వీనర్ గా నియమించామని , రవి సమర్థుడు కాబట్టే ఆ బాధ్యతలు అప్పగించామన్నారు. తనని కన్వీనర్ గా నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ లావు అంజయ్య చౌదరికి అలాగే తానా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు రవి.