USA పర్యటనలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు రాజేంద్రప్రసాద్. ఆ సందర్భంగా అమెరికాలోని సౌత్ కరోలినా గవర్నర్ గా సేవలందించిన నిక్కీ రంధావా హేలీ తో సమావేశమయ్యారు రాజేంద్రప్రసాద్.
భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ అమెరికా రాజకీయాల్లో రాణిస్తుండటం విశేషం. గవర్నర్ గా సేవలు అందించిన హేలీ ఐక్యరాజ్య సమితి లో సైతం అమెరికా రాయబారిగా విశిష్ట సేవలందించింది. ఇక 2024 లో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిక్కీ హేలీ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పోటీ చేయబోతున్నారు. దాంతో 2024 లో జరుగబోయే ఎన్నిమాల్లో నిక్కీ హేలీ విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు రాజేంద్రప్రసాద్.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నారై సెల్ సభ్యులు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో చర్చించారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ , గుత్తికొండ శ్రీనివాసరావు, పిన్నమనేని ప్రశాంత్, శ్రీనాథ్ రావు తదితరులు పాల్గొన్నారు.