మే 28 న మహానటుడు , మహా నాయకుడు నందమూరి తారకరామారావు పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే నెలలో ఇదే ఆనవాయితీ కొనసాగించనున్నారు టీడీపీ ఎన్నారై సభ్యులు.
తాజాగా యూరోప్ లోని బర్మింగ్ హోమ్ నగరంలో టీడీపీ ఎన్నారై వింగ్ సమావేశమైంది. మే 28 న మహానాడు కార్యక్రమాన్ని యూరోప్ లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో జూమ్ లో అందుబాటులోకి వచ్చారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లందరూ …… తెలుగుదేశం పార్టీని అభిమానించేవాళ్ళు తప్పనిసరిగా టీడీపీ మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.