
అమెరికాలో తెలుగు విద్యార్ధి పై కాల్పులు జరిపారు దుండగులు. దాంతో ఒక విద్యార్ధి మృతి చెందగా మరొక విద్యార్ధి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్పందించిన పోలీసులు , స్థానికులు ఆ యువకులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఒక విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డికి చెందిన కొప్పుల సాయి చరణ్, విజయవాడ కు చెందిన దివ్యాన్ష్ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు.
చికాగో లోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ముగ్గురు స్నేహితులు కూడా వాల్ మార్ట్ లోకి వెళ్ళేక్రమంలో నల్ల జాతీయులు దివ్యాన్ష్ , సాయి చరణ్ పై కాల్పులకు తెగబడ్డారు. దాంతో దివ్యాన్ష్ , సాయి చరణ్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే దివ్యాన్ష్ , సాయి చరణ్ లను చికాగో లోని మెడికల్ సెంటర్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ దివ్యాన్ష్ మరణించాడు. సాయి చరణ్ మాత్రం కోలుకుంటున్నాడు దాంతో స్టూడెంట్స్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు అమెరికా పోలీసులు .