కింగ్ ఆఫ్ ప్రష్యా లో స్థిరపడిన పలువురు ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసుకున్న సంస్థ ” Telugu Association Of Greater Delaware Valley ” . ఈ సంస్థను నెలకొల్పి 50 ఏళ్ళు అవుతుండటంతో 2023 ఏప్రిల్ 7 మరియు 8 వ తేదీలలో రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కింగ్ ఆఫ్ ప్రష్యా లోని కాసినో రిసార్ట్ లో రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి.
ఇక ఈ వేడుకలకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. సీనియర్ నటి జయసుధ , హీరో సుమన్ , హీరోయిన్ లు అను ఇమ్మాన్యుయేల్ , ఈషా రెబ్బా , నేహా కృష్ణ , నటి సురేఖా వాణి , హీరో సత్యదేవ్ , సింగర్ సునీత , అనుదీప్ తదితరులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం మార్చి 7 న టికెట్ల అమ్మకాల కోసం సెమినార్ నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.