
తెలుగువాళ్ళకు ముఖ్యమైన పండుగలలో ఉగాది ముఖ్యమైనది అనే విషయం తెలిసిందే. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండగను తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా ఉగాది ఉత్సవాలను జరుపుకోవడం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఏప్రిల్ 15 న అమెరికాలోని త్రాషర్ హార్న్ సెంటర్ లో ఉగాది ఉత్సవాలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తోంది జాక్వన్విల్ తెలుగు సంఘం. ఈ ఉత్సవాలను నిర్వహించడానికి మహేష్ బాచు , సురేష్ చంచల , శ్రీదేవి ముక్కోటి , కృష్ణ పులగం , నాగేశ్వర్ రావు , సమత దేవునూరి , ముండ్రాతి థాను , మల్లు సత్తి , సురేష్ తదితరులు ఈ ఉత్సవాల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొననున్నారు.