
తెలుగు అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు మార్చి 18 న జరుగనున్నాయి. అమెరికాకు చెందిన సెంటు మార్టిన్స్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. దుబాయ్ లో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ఉన్న విషయం తెలిసిందే. తెలుగు వాళ్లకు ముఖ్యమైన పండగ ఉగాది దాంతో ఆ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తెలుగు అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
ఇక ఈ వేడుకలలో గాయకురాలు , సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ , హీరోయిన్ కామ్నా జఠ్మలాని , మిమిక్రి రాజు లతో పాటుగా పలువురు ప్రముఖులు, లోకల్ టాలెంట్ సింగర్స్ కూడా పాల్గొననున్నారు.