న్యూజెర్సీలో ఉన్న ప్రవాసాంధ్రులు ” Telugu People Foundation ” అనే స్వచ్ఛంద సంస్థ ను నెలకొల్పి తమకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన రెండు తెలుగు రాష్ట్రాలకు అండగా ఉండాలని భావించారు. ఆర్ధిక స్థోమత లేక ఉన్నత చదువులు చదవలేని పేద విద్యార్థులకు అండగా నిలబడాలని భావించి వాళ్లకు స్కాలర్ షిప్ లు అందిస్తూ సామాజిక సేవలో తరిస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా….. ఇప్పటి వరకు 30 మిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఈ సేవా కార్యక్రమాలకు వినియోగించారు. 325 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించారు.
తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు అవుతుండటంతో న్యూజెర్సీలో ని ఎడిసన్ లోగల జేపీ స్టీవెన్స్ హైస్కూలు లో 14 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 107,000 డాలర్ల ను ఫండ్ గా సేకరించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ , కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ , చార్టెడ్ అకౌంటెంట్ వంటి ఉన్నత విద్య కోసం ఆర్ధిక సహాయం చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ సంస్థ చేసిన 325 మందిలో 126 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్టూడెంట్స్ ఉన్నారు.
26 మంది ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ ఐ టి వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో చదువుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కొత్త కృష్ణ. ఫౌండర్ కొనిశెట్టి ప్రసాద్ . ఈ కార్యక్రమంలో అనూప్ రూబెన్స్ , గాయకుడు సింహా లతో పాటుగా పలువురు పాల్గొన్నారు. తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్ మిమిక్రీ తో అలరించాడు. న్యూజెర్సీ, ఎడిసన్ లకు చెందిన తెలుగు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.