అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతం న్యూజెర్సీ లోని ఎడిసన్. కాగా ఎడిసన్ లోని ఓ జ్యువెల్లరీ షాప్ లోకి చొరబడిన దుండగులు తుపాకులతో బెదిరించి బంగారు నగలను , సిల్వర్ అలాగే వజ్రాలను సంచుల్లో నింపుకొని మరీ పారిపోయారు.
ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో దుండగులు తుపాకులు చేతబట్టి షాప్ లోకి చొరబడటంతో షాక్ అయ్యారు. వాళ్ళు షాక్ నుండి తేరుకోకముందే షాప్ ని లూటీ చేసి వెళ్లిపోయారు. ఈ తతంగమంతా సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ఇక సంఘటన జరిగిన తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.