అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఘనంగా సన్మానించారు ప్రవాసాంధ్రులు. ఈ కార్యక్రమంలో అమెరికాలో ఉన్న అన్ని రకాల అసోసియేషన్ నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎడిసన్ లోని సాయి దత్త పీఠం లోని దేవాలయాలను దర్శించుకున్నారు ఎన్వీ రమణ. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రవాసాంధ్రులు రమణను ఘనంగా సన్మానించారు. సాయి టెంపుల్ ఫౌండర్ డాక్టర్ నూరి రాసిన బుక్ ని కూడా రిలీజ్ చేశారు జస్టిస్ ఎన్వీ రమణ. ఈ కార్యక్రమంలో శంకరమంచి రఘు శర్మ, జైస్వరాజ్య , JSW అడ్వైజర్ జగదీష్ యలమంచిలి, రమేష్ యలమంచిలి, డాక్టర్ శివకుమార్ ఆనంద్, కాన్సూల్ జనరల్ రణ్ ధీర్ జైస్వాల్ లతో పాటుగా అన్ని రకాల తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.