
అమెరికాలో ఆదివారం రోజున భారీ రోడ్డు ప్రమాదంలో ఎన్నారై కుటుంబం మరణించిన విషయం తెలిసిందే. ప్రవాసాంధ్రులు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ , కూతుర్లు మేఘన , నిఖిల ఈ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్.
అయితే వాణిశ్రీ , మేఘన, నిఖిల చనిపోయే ముందు ఆసక్తికర సంఘటన జరిగింది. వాణిశ్రీ కి హిందు సాంప్రదాయం పట్ల విపరీతమైన మమకారం. నిరంతరం దైవత్వాన్ని స్మరిస్తూనే ఉంటుంది. తన పెద్ద కూతురు , చిన్న కూతురుతో కలిసి తిరుగు ప్రయాణంలో వాలర్ లోని గోశాలను సందర్శించారు. గోశాలలోని ఆవులను పూజించారు. నవరాత్రి వేడుకలు జరుగుతుండటంతో మార్గమధ్యంలో ఉన్న గోశాలలో పూజలు నిర్వహించారు. అనంతరం సంతోషంగా హ్యూస్టన్ లోని ఇంటికి వస్తుండగా దారుణం చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో భార్య , ఇద్దరు కూతుర్లు మరణించారు. దాంతో డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు. పలువురు ప్రవాసాంధ్రులు డాక్టర్ శ్రీనివాస్ ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అక్టోబర్ 1 న వాణిశ్రీ , మేఘన , నిఖిల ల అంత్యక్రియలు జరుగనున్నాయి.