ఆసియా ఖండం లోని వాళ్ళని జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది FBI. ముఖ్యంగా భారత్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలకు హెచ్చరికలు జారీ చేసింది అమెరికా దర్యాప్తు సంస్థ FBI. అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ అనే విషయం తెలిసిందే. అలాగే నేరాలకు పాల్పడే హంతక ముఠా అమెరికాలో ఉంటున్న ఆసియా ఖండానికి చెందిన వాళ్ళని అందునా భారత్ కు చెందిన వాళ్ళని టార్గెట్ గా పెట్టుకున్నారట.
ఎప్పటికప్పుడు వాళ్ళ కదలికలను గమనిస్తూ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అంటూ వ్యాపారస్తులను జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. వ్యాపారస్తులు తమ వెంట డబ్బు ని ఉంచుకోవద్దని , సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలని , వ్యాపారస్తుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే దాడులకు పాల్పడటానికి పెద్ద ముఠా పొంచి ఉందని హెచ్చరించడంతో ఏషియన్ – అమెరికన్ లు భయపడుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని , జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ఎఫ్ బి ఐ అధికారులు.