కువైట్ 60 ఏళ్లకు పైబడిన వాళ్ళ పట్ల కఠిన వైఖరి అవలంభించడం వల్ల వృద్ధుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కువైట్ ప్రవాస వృద్ధుల పట్ల కఠిన వైఖరి అవలంభించడానికి కారణం ఏంటో తెలుసా ……. కరోనా పుణ్యమే ! అవును 2020 లో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.
కరోనా వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది 60 ఏళ్లకు పైబడిన వాళ్లే కాబట్టి 2020 నుండి ప్రవాస వృద్దులకు వర్క్ పర్మిట్ వీసాలను నిలుపుదల చేసింది. దాంతో కువైట్ లో ఉన్న ప్రవాస వృద్దులు తమతమ దేశాలకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కువైట్ నిర్ణయం వల్ల రెండేళ్ల కాలంలోనే వృద్ధుల సంఖ్య చాలా తగ్గిపోయింది. అయితే ఇటీవల కఠిన నిర్ణయాల పట్ల కాస్త సడలింపులు ఇవ్వడంతో మళ్ళీ ప్రవాస వృద్దులు కువైట్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.