తెలుగుదేశం పార్టీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళ సహకారంతో పలు ప్రాంతాల్లో కమిటీలను వేస్తోంది. అందులో భాగంగానే నెదర్లాండ్ లో కూడా ఎన్నారై సెల్ ఏర్పాటు చేసింది.
నెదర్లాండ్ ఎన్నారై సెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు గా వివేక్ కరియావుల , ప్రధాన కార్యదర్శి గా వెంకట్ కోకా , కోశాధికారిగా తేజ గోయెల్లా , రీజనల్ కౌన్సిల్ రిప్రజంటేటివ్ గా శ్యామ్ , సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మధుకర్ రెడ్డి లను నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియమించారు. ఆమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.