
అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. మంచు తుఫాన్ ధాటికి ముగ్గురు తెలుగువాళ్లు మరణించారు. దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం గుంటూరు వాసి నారాయణ అమెరికా వెళ్ళింది. అక్కడ జరిగిన సంఘటన ఘోర విషాదాన్ని కలిగించింది. నారాయణ రావు – హరిత దంపతులు అలాగే వైజాగ్ వాసి గోకుల్ ఈ సంఘటనలో మరణించారు.
మూడు కుటుంబాలు క్రిస్మస్ వేడుకల కోసం ఫీనిక్స్ సరస్సు వద్దకు చేరుకున్నారు. సరస్సు మంచు గడ్డకట్టడంతో చాలా అందంగా ఉందని భావించి ఫోటోలు దిగడానికి వెళ్లారు. మొదట నారాయణ రావు – హరిత ల కూతురు మొదట మంచు పలకమీదకు చేరుకుంది. అయితే అదే సమయంలో నారాయణ – హరిత కూడా అదే మంచు పలకమీదకు చేరుకోవడంతో ఆ మంచు బ్రేక్ అయ్యింది. దాంతో నీళ్లలో కూడా కూరుకుపోయారు. కూతురు ని రక్షించారు కానీ నారాయణ – హరిత లు మాత్రం ఆ నీళ్లలో పడిపోయారు. వాళ్ళను కాపాడటానికి వచ్చిన గోకుల్ కూడా సరస్సు లో పడి మరణించారు. దాంతో తెలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.