
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చారు ట్విట్టర్ ఉద్యోగులు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాడు . అంతేకాదు రకరకాల నిర్ణయాలు ప్రకటించి గందరగోళం సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో చాలామందిని తొలగించాడు. దాంతో ట్విట్టర్ లో పనిచేస్తున్న వాళ్లలో తీవ్ర అసహనం మొదలైంది.
తమ ఉద్యోగాలు ఉంటాయో ? లేదో తెలియని అయోమయం నెలకొనడంతో ఇక అక్కడ పని చేసి లాభం లేదని భావించి ఎలాన్ మస్క్ కు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లకుండా పని చేయకుండా షాక్ ఇచ్చారు. దాంతో ఎలాన్ మస్క్ కు ఏమి చేయాలో పాలు పోవడం లేదట.