అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా ఒక పోలీస్ అధికారి గాయపడినట్లు సమాచారం. అమెరికాలోని వాషింగ్టన్ కు ఈశాన్యంగా ఉన్న హడ్సన్ నది ఒడ్డున గల కోల్ విల్లే ట్రైబ్స్ రిజర్వేషన్ లో ఈ సంఘటన జరిగింది. అమెరికాలో కాల్పులు నిత్యకృత్యం అనే విషయం తెలిసిందే.
గిరిజన ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల జరగడంతో షాక్ అయ్యారు అక్కడి ప్రజలు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు తెగబడిన వాళ్ళను పట్టుకునే పనిలో భాగంగా ఒక పోలీసు అధికారి కూడా గాయపడ్డారు. ఇక కాల్పులకు పాల్పడిన వాళ్లలో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.