అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు తెలంగాణ స్టూడెంట్స్ నీట మునిగి చనిపోయారు. ఈ వార్త మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన శివశక్తి దత్తా , నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లారు. వీకెండ్ కావడంతో సరదాగా ఈత కోసం సెయింట్ లూయిస్ కు వెళ్లారు. అక్కడ చెరువులోకి దిగారు. అయితే చెరువు లో నీరు మరీ చల్లగా ఉండటంతో కొందరు వెంటనే బయటకు వచ్చారు. కానీ ఉత్తేజ్ , శివశక్తి దత్తా మాత్రం గల్లంతయ్యారు. దాంతో గల్లంతైన మృతదేహాలను వెలికి తీశారు. ఉత్తేజ్ , శివశక్తి దత్తా మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Breaking News